Monday, August 2, 2021
HomeMovie NewsRRR night shooting : ఆర్‌ఆర్‌ఆర్ నైట్ షూటింగ్ అప్డేట్స్

RRR night shooting : ఆర్‌ఆర్‌ఆర్ నైట్ షూటింగ్ అప్డేట్స్

RRR night shooting :

ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం RRR. టాలీవుడ్ ప్రేక్షకులు యెంతో ఆసక్తి గా యెదురు చూస్తున్న చిత్రం RRR. ఇటీవల చిత్ర యూనిట్ Jr Ntr పోషిస్తున్న పాత్ర కొమరం భీమ్, ట్రేలర్ ని విడుదల చేసారు. విడుదల చేసిన కొన్ని గంటలకే యూట్యూబ్ లో ట్రేండింగ్ గా మారింది.అయితే ట్రేలర్ చివర్లో Jr ntr ముస్లిం టోపి ధరించి కనిపిస్తారు. ఇది ఒక్కింత ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిజాం కాలంలో పోరాడిన కొమరం భీమ్ యెందుకు టోపి ధరించారు అని తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.


ప్రస్తుతం చిత్ర యూనిట్ నైట్ షూటింగ్స్ లో బిజి గా ఉన్నారు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆపి, మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభించారు. నైట్ షూటింగ్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ వీడియోలు నెట్ లో చెక్కర్లు కోరుతున్నాయి. హీరో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు ట్రేలర్ కూడా విడుదల అయి యూట్యూబ్ లో ట్రేండింగ్ గా మారింది. Jr ntr ట్రేలర్ కి రామ్ చరణ్ మరియు రామ్ చరణ్ ట్రేలర్ కి Jr ntr వాయిస్ ఓవర్ ఇచ్చారు. విడుదల అయిన రెండు ట్రేలర్స్ పై నెటిజన్స్ రాజమౌళి కొన్ని సీన్లు కాపీ చేశారని trolls చేస్తున్నారు.

ఈ సినిమా లో అలియాబట్ హీరోయిన్ గా చేస్తోంది. అజయ్ దేవగన్, శ్రియ శరన్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యం యం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో నే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది RRR.

RELATED ARTICLES

Most Popular

Recent Comments