Richa gangopadhyay mayakkam enna complete 10 years :
తొమ్మిదేళ్ల తర్వాత కృతజ్ఞతలు తెలియజేశారు హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ. తన మొదటి సినిమాను హీరో దగ్గుబాటి రానా జంటగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ ఆ తరువాత రవితేజ తో జోడిగా మిరపకాయ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల అమ్మడు సినిమాకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆమె నటించింది తిమ్మిది సినిమాలే అయిన అన్నిట్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇది ఇలా ఉండగా తమిళంలో హీరో ధనుష్ మరియు రీచా కలిసి నటించిన చిత్రం మాయక్కమ్ఎన్న Mayakkam enna రిలీజ్ అయి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిన సంధర్భంగా ఇలా ట్వీట్ చేశారు.
మాయక్కమ్ఎన్న Mayakkam enna సినిమా అప్పుడే తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుందంటే నమ్మలేకపొతున్నాను. నా కలలను నిజం చేసుకోవడానికి సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది.ఆ సమయంలోనే నాకు చదువుపై దృష్టి పెట్టాలనిపించింది అందుకే ఎంబీఏ పూర్తి చేశాను ఆ తర్వాతనే పెళ్లి చేసుకున్నాను. సినిమాలకి దూరంగా ఉన్న నా లైఫ్ అంటే నాకు ఇష్టం అంటూ ట్వీట్ చేశారు.