Middle class melodies Movie Review
ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమా జంటగా నటించిన చిత్రం ” middle class melodies” ఈ రోజు OTT వేదికగా amazon prime video లో సినిమా రిలీస్ అయింది.
Middle class melodies Movie Review:
సినిమా : middle class melodies
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ
డైరెక్టర్ : వినోద్ అనంతోజు
నిర్మాత: వెనిగల్లా ఆనంద్ ప్రసాద్
సంగీతం: స్వీకర్ అగస్తి, ఆర్‌హెచ్ విక్రమ్
ఎడిటర్: రవితేజ గిరిజల
ఛాయాగ్రహణం: సన్నీ కురపతి
రిలీస్ డేట్ : 20 Nov 2020
కథ :
రాఘవ ( ఆనంద్ దేవరకొండ) ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో జన్మిస్థాడు. రాఘవ బొంబాయి చట్నీ తయారు చేయడంలో చాలా ఫేమస్, గుంటూరు లో సొంతగా హోటల్ పెట్టి తన కాళ్ల పై తాను నిలబడాలనుకుంటాడు. రాఘవ తన స్కూల్ ఫ్రెండ్, మరదలు అయిన సంధ్య ఒకరికి ఒకరు ప్రేమలో పడతారు. గుంటూరు హోటల్ పెట్టాలని అనుకున్న రాఘవ వద్ద డబ్బు ఉండదు. తన తండ్రి ల్యాండ్ అమ్మి రాఘవ తో హోటల్ పెట్టిస్తారు, కానీ హోటల్ క్లిక్ అవడానికి హీరో చాలా కష్టాలు పడతారు. ఈలోగా సంధ్య కి వాళ్ల డాడీ వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు. చివరికి హీరో రాఘవ, సంధ్య ని పెళ్ళి చేసుకున్నాడా లేధా? హోటల్ క్లిక్ అవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? అని తెలుసు కోవాలంటే సినిమా చూడాల్సిందే…!
ప్లస్ పాయింట్స్ : సినిమా పేరు middle class melodies కి తగినట్లు గా కథ ఉంది. మొదటగా సినిమా స్లో గా స్టార్ట్ అయినా, తర్వాత స్టోరీ చాలా ఇంటరెస్ట్ గా ఫన్నీ గా సాగుతుంది. డైరెక్టర్ కారెక్టర్ లోని భావోద్వేగాలని చాలా చక్కగా చూపించారు. హీరో ఆనంద్ దేవరకొండ కి ఇది రెండవ సినిమా అయినా చాలా చక్కగా నటించాడు. వర్ష హీరోయిన్ పాత్ర లో చాలా చక్కగా నటించింది. దివ్య కూడా తన పాత్ర కి న్యాయం చేసింది. హీరో స్నేహితుడుగా నటించిన గోపాల్ తన కామిడీ తో ప్రేక్షకులను బాగా నవ్వించాడు. Middle class melodies రొటీన్ స్టోరీ అయినా కామిడీ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ : middle class melodies ఒక రొటీన్ స్టోరీ. చాలా సింపుల్ గా కామిడీ తో సినిమా అలా సాగిపోతుంది. కొంచం ట్విస్ట్ లు ఉంటే బాగుండేది. ఫస్ట్ ఆఫ్ కొంచం స్లో గా ఉంటుంది.
సాంకేతికత : గుంటూరు పరిసర ప్రాంతాల లొకేషన్ లో చిత్రీకరణ, కెమెరా వర్క్ చాలా బాగుంది. స్వీకర్ మరియు ఆర్‌హెచ్ విక్రమ్ సంగీతం ఈ చిత్రానికి చాలా చక్కని సంగీతం అందించారు. చిత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అందించారు. గుంటూరు జిల్లా యాస ని మరియు మధ్య తరగతి జీవితం లో ఉండే కష్టాలని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు వినోద్. ఎమోషన్స్, కామిడీ, లవ్ మూడింటి ని చాలా చక్కగా చూపించారు.
తీర్పు : middle class melodies ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామా. సినిమా లో కామెడీ, ఎమోషన్స్, రొమాన్స్‌ను ని సమతుల్యం చేసి చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు స్టోరీ కూల్ గా కామిడీ తో సాగిపోతుంది.
Telugunetflix.com Rating : 3/5